ఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా రఘురాం

ఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా రఘురాం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​గా కె.రఘురాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఇన్​చార్జ్ డీసీగా కరీంనగర్​ డీసీ టి.డేవిడ్​రవికాంత్​అదనపు బాధ్యతలు నిర్వహించారు. కాగా ఆయన స్థానంలో హైదరాబాద్​ హెడ్ క్వార్టర్స్​లో​ డీసీగా ఉన్న కె.రఘురాంకు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

బాధ్యతలు తీసుకున్న ఆయనకు టీఎన్జీఓస్​జిల్లా సెక్రటరీ కె.అరుణ్​కుమార్, సిబ్బంది బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.