
కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని తెరకెక్కించిన చిత్రం ‘కే ర్యాంప్’. రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. ఈనెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ ‘మద్రాస్ ఐఐటీలో చదువుకున్న నేను అక్కడ ఉన్నప్పుడే షార్ట్ ఫిలింస్ చేశాను. అవి ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో టాలీవుడ్‌కు వచ్చా. కిరణ్ అబ్బవరం గారితో ఏడాదిన్నర ట్రావెల్ చేశా. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. సరదాగా మొదలయ్యే ఆ పాత్ర ఆ తర్వాత ఇబ్బందుల్లో పడుతుంది. ఆ సిచ్యువేషన్‌కు తగ్గట్టుగా ‘కే ర్యాంప్’ టైటిల్ పెట్టాం.
యూత్ ఆడియెన్స్‌ను థియేటర్‌కు అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ట్రైలర్‌ను కట్ చేశాం తప్ప సినిమా మొత్తం అలా ఉండదు. యూత్‌కు నచ్చితే వాళ్లు ఫ్యామిలీస్‌ను తీసుకొస్తారనేది మా నమ్మకం. ఇది కచ్చితంగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా. ఇంటర్వెల్ సీన్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇందులోని పాత్రకు యుక్తి పర్పెక్ట్‌గా యాప్ట్. తనతో వర్క్ షాప్, కీ సీన్స్ రిహార్సల్స్ అయ్యాక షూటింగ్‌కు వెళ్లాం. హీరోహీరోయిన్స్‌కు మంచి పేరొస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో హీరో పాత్ర, సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్ర ఎంటర్‌టైన్ చేస్తాయి. సినిమాకు ఫ్రెష్ నెస్ కోసం కేరళ నేపథ్యం ఎంచుకున్నాం. మూడు పాటలు ఉన్నాయి. మరో పాటకు అవకాశం ఉన్నా కథలో వేగానికి అడ్డుపడుతుందని వద్దనుకున్నాం. కామ్నా జెఠ్మలానీ చిన్న గెస్ట్ రోల్ చేశారు. నరేష్ గారి కాంబినేషన్‌లో ఆమె సీన్స్ హిలేరియస్‌గా వచ్చాయి. 47 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాలో ఫన్, ఎంటర్‌టైన్మెంట్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.