పోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి : కె.రాములు

పోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి : కె.రాములు

ముషీరాబాద్, వెలుగు: పోస్టల్ శాఖలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె.రాములు అన్నారు. ఆదివారం ఆలిండియా పోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ రాష్ట్రస్థాయి నాలుగో కాన్ఫరెన్స్​ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 

డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కృషి ఫలితంగానూ రిజర్వేషన్లు వచ్చి, వాటి ద్వారానే ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. సర్కిల్ కన్వీనర్ ఏఎస్.చలపతి గిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ జనరల్ పళనిరాజన్, నాయకులు రాజ్, ఎన్,రాజారత్నం, డాక్టర్ ఎం.ఆంజనేయులు, జి.నర్మద, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.