V6 News

దేశమంతా సిరిసిల్ల వైపు చూసేలా చేస్తా : కేటీఆర్ 

దేశమంతా సిరిసిల్ల వైపు చూసేలా చేస్తా : కేటీఆర్ 
  • బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల,వెలుగు:2028లో బీఆర్​ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల, వేములవాడను దేశం అంతా చూసేలా అబివృద్ధి చేస్తానని కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలో బీఆర్​ఎస్ నాయకులను పరామర్శించారు. తంగళ్లపల్లిలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణానికి హాజరయ్యరు.రామన్నపల్లెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం సిరిసిల్ల పట్టణంలో అట్టహసంగా నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ క్రీడల వల్ల యువతలో దాగి ఉన్న స్కిల్స్ బయటకు  వస్తాయన్నారు. యువతకు ఎంకరేజ్ చేసేందుకు టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామన్నారు.సిరిసిల్లలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్​లో 157 టీమ్​లు మ్యాచ్​లు, 2512 మంది యువ క్రీడాకారులు క్రికెట్ఆడారన్నారు.

సిరిసిల్ల డాల్ఫిన్ టీమ్​ విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే సమ్మర్​లో రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. 2027ఫిబ్రవరి 17 నుంచి బీఆర్​ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 వరకు పెద్ద ఎత్తున్న క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. సిరిసిల్లను అన్నివిధాలుగా అబివృద్ధి చేస్తానన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారన్నారు. ఈ సంవత్సరం దసరా వరకు వాలీబాల్, కబడ్డీ ఆటలపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడలతో పాటు మ్యూజికల్ షో ఈవెంట్లు  బీఆర్​ఎస్ పార్టీ తరపున జరుపుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్ నాయకులు కొండూరి రవీందర్ రావు, తోట ఆగయ్య, గుడూరి ప్రవీణ్, జిందం కళ, చక్రపాణి,చల్మెడ లక్ష్మీనర్సింహులు పాల్గొన్నారు.