సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిటీషన్: కేఏ పాల్

సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిటీషన్: కేఏ పాల్

నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ ఘటనపై సీబీఐతో  విచారణ చేయించాలని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.  తాను దాఖలు చేసిన పిటీషన్ విచారణకు రాకుండా చూస్తున్నారని  చీఫ్ జస్టిస్కు పాల్  వివరించారు.  కొత్త సెక్రటేరియట్ను క్రైమ్ జోన్గా గుర్తించాలని... నూతన సెక్రటేరియట్ను సీజ్ చేసి విచారణ జరపాలని తన పిటీషన్లో పేర్కొన్నారు. అలాగే అగ్నిప్రమాదం  ప్రమాదవశాత్తు జరిగిందా ..లేక నరబలి ఏమైనా జరిగిందా అనేది విచారణ చేయాలని పిటీషన్లో పాల్ కోరారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిటీషన్కు నెంబరింగ్ ఇవ్వాలని  రిజిస్టార్ను  చీఫ్ జస్టిస్ ఆదేశించారు.

అటు సెక్రెటేరియేట్ ప్రారంభోత్సవంపై కేఏ పాల్ మరో పిల్ దాఖలు చేశారు. నూతన సెక్రెటేరియేట్ను కేసీఆర్ పుట్టినరోజున కాకుండా.. డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని పిల్ వేశారు. ఈ రెండు పిటీషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేసే అవకాశం ఉంది. 

తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సెక్రటేరియేట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. అయితే కొత్త సెక్రటేరియేట్లో ఫిబ్రవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం మాక్ డ్రిల్ అని పోలీసులు చెప్పగా.....స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించడం  చర్చనీయాంశం అయింది.