పాల్ వర్సెస్ రాజగోపాల్

పాల్ వర్సెస్ రాజగోపాల్

రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి డ్రామా అమిత్ షాను కలిసిన తరువాత మొదలైందని ప్రజశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. "రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఆయన ఎందుకు రాజీనామా చేశాడో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఏపీలో టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఎందుకు బీజేపీలో చేరారో తనకు తెలుసని పాల్ చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతుంటే... సీబీఐ, ఈడీకి భయపడి ఇలా బీజేపీలో చేరిపోతున్నారని అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం బీజేపీ వద్దద మోకారిల్లాడని పాల్ ఆరోపించారు. బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ బీజేపీలో జాయిన్ అవ్వడానికి నిరకరించడంతో ఆయనను జైలుకి పంపారని, బీజేపీలో చేరకపోతే వారికి కూడా ఆ గతే పడుతుందని అందరూ భయపడుతున్నారని చెప్పారు. కర్ణాటక,తమిళనాడులో కూడా ఇదే తంతు ఉందని జయలలిత వంటి మహా నాయకురాలు కూడా బీజేపీనీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 

రాజగోపాల్ రెడ్డి అమిత్ షా దగ్గరకు ఎందుకు వెళ్లారో తనకు తెలుసని పాల్ అన్నారు. కేసీఆర్ కుటుంబానిది అవినీతి పాలన అంటున్న రాజగోపాల్ బీజేపీ అంతటి మత పాలన ఎక్కడైనా ఉందా..? చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే పుణ్యుడవు అవుతావా అని నిలదీశారు. 100 వాగ్దానాలు చేసిన నరేంద్ర మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని పాల్ విమర్శించారు. గాంధీ కుటుంబ పాలన దేశాన్ని సర్వ నాశనం చేసిందని, బీజేపీ దేశాన్ని శ్రీలంకలా తయారు చేస్తోందని ఆరోపించారు. తాను తప్ప ఎవరు కూడా మోడీని ఎదిరించలేరన్న పాల్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు క్షమించరని దమ్ముంటే రాజకీయాలకు మునుగోడు ప్రజల తరపున నిలబడమని కేఏ పాల్ హితవు పలికారు.