గ్రేటర్ వరంగల్, వెలుగు: ఇండియా–- సౌదీ ఆరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇండియా- సౌదీ ఆరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ ఈ బాధ్యత తనకు అప్పగించనందుకు లోక్‌సభ స్పీకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
