పోటీ చేసిన ఐదుగురు మహిళల్లో ఇద్దరు విన్

పోటీ చేసిన ఐదుగురు మహిళల్లో ఇద్దరు విన్

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో  రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళలు పోటీ చేయగా ఇద్దరే గెలిచారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కడియం కావ్య.. దాదాపు 2.20 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, మహబూబ్​నగర్ నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసిన డీకే.అరుణ కూడా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్​అభ్యర్థిపై 4,500 మెజార్టీతో గెలుపొందారు. 

ఈ ఇద్దరు మహిళలే రాష్ట్రం నుంచి పార్లమెంట్​లో రిప్రజెంట్​ చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి విజయం సాధిస్తారని భావించిన కాంగ్రెస్​అభ్యర్థి ఆత్రం సుగుణ , అనూహ్యంగా బీజేపీ చేతిలో ఓటమిపాలయ్యారు. మహబూబాబాద్  లోక్​సభ సెగ్మెంట్​ నుంచి బీఆర్ఎస్​ తరపున పోటీ చేసిన మాలోతు కవితకు కూడా పరాజయం తప్పలేదు. మల్కాజ్​గిరి నుంచి కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన పట్నం సునీతా మహేందర్​రెడ్డి కూడా గెలవలేదు. మొత్తం 17 పార్లమెంట్​సెగ్మెంట్లలో 51 మంది మహిళలు పోటీ చేశారు. గత పార్లమెంట్​ఎన్నికల్లో తెలంగాణ నుంచి మాలోతు కవిత ఒక్కరే మహిళా ఎంపీగా ఉన్నారు.