Kajal Agarwal: ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన కాజల్.. వీడియో వైరల్

Kajal Agarwal: ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన కాజల్.. వీడియో వైరల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించగా మరో డైరెక్టర్ శశికిరణ్ టిక్కా నిర్మించారు. ఇక పెళ్లి తరువాత కాజల్ చేసిన సినిమా కావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ, విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ మూవీ. దాంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. 

ఇదిలా ఉంటే.. జూన్ 19న కాజల్ అగర్వాల్ తన 39వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సంధర్బంగా కాజల్ ఫ్యాన్స్ చేసిన పనికి ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక అసలు విషయం ఏంటంటే.. కాజల్ పుట్టినరోజు సందర్బంగా ఆమె ఫ్యాన్స్ 150 మందికి ఫుడ్ పంచారు. అలాగే ఈ నెలాఖరులోగా 50 మొక్కలు నాటదానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్నీ వివరిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియో చూసిన కాజల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.