సంగారెడ్డి టౌన్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించే కాకా వెంకటస్వామి టీ 20 ఇంట్రా డిస్టిక్ క్రికెట్ లీగ్ కం నాకౌట్ పోటీల్లో పాల్గొనే సంగారెడ్డి మెదక్ జిల్లాల జట్ల ఎంపిక బుధవారం సంగారెడ్డి లోని ఎమ్మెస్ అకాడమీలో నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా జట్టుకు 15 మంది మెదక్ జిల్లా జట్టుకు 15 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు. 18న సిద్దిపేట జిల్లా జట్టు ఎంపిక సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.
