గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. కాకా క్రికెట్ టోర్నమెంట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

 గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు.. కాకా క్రికెట్ టోర్నమెంట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

 గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు  కాకా వెంకటస్వామి మెమోరియల్ పోటీలు స్టార్ట్ చేశామన్నారు మంత్రి వివేక్ వెంకస్వామి.  జిల్లా స్థాయి క్రికెటర్ లకు ఐపీఎల్ వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు  కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వరంగల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన...ఇప్పటివరకు హైదరాబాద్ బేస్డ్ గానే ఐపీఎల్ లాంటి పోటీలు జరిగేవని.. జిల్లాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోయేదని  అన్నారు.  

హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ లీగ్ పోటీలు పెట్టామని.. అప్పుడు రూరల్ ఏరియా నుంచి ఆదిలాబాద్ గెలిచిందని చెప్పారు.  ఆ తర్వాత వెలుగు క్రికెట్ టోర్నీ పెట్టామన్నారు మంత్రి వివేక్.. కాకా టోర్నమెంట్ లో   ప్రతి మ్యాచ్ ను 20 నుంచి 30 వేల మంది చూస్తున్నారని చెప్పారు మంత్రి వివేక్.  అదే ఉత్సాహంతో మరిన్ని పోటీలు నిర్వహిస్తామన్నారు.  ప్రతి సంవత్సరం ఇలాగే పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

వరంగల్ జిల్లాలో జరుగుతున్న హైదరాబాద్, వరంగల్ మ్యాచ్ కు   మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.  ఆయనతో పాటు హెచ్ సీఏ, వరంగల్ క్రికెట్ అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు.  హైదరాబాద్, వరంగల్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ ను పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి .

క్రీడల్లో యువత టాలెంట్ ను వెలికి తీసేందుకు కాకా కుటుంబం కృషి చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మత్తు వదలండి.. మైదానానికి రండి అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం వరంగల్ కు స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం మంజూరు చేసిందని చెప్పారు.  టాలెంట్ ఎవరి సొత్తు కాదని.. టాలెంట్ ను వెలికితీసి యువకులను ప్రోత్సహించేందుకు పాటుపడుతున్న కాకా ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపారు.