ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామికి మంత్రి వివేక్ నివాళి

ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామికి మంత్రి వివేక్ నివాళి

 హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి,అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాడెంట్ సరోజ వివేక్. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్..కార్మిక రంగంలో కాకా విప్లవాత్మక సంస్కరణలు  తెచ్చారని చెప్పారు. భారత్ క్రికెట్ కు కాకా ఆదరణ కల్పించారని అన్నారు.తమ కుటుంబ సభ్యులకు అండగా ఉన్న సోనియా,రాహుల్ కు కృతజ్ఞతలు తెలిపారు వివేక్.  నిరుపేదలకు కాకా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.  కాకా బాటలోనే తాము ప్రయాణిస్తున్నామని  వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా నిరంతరం పేదల కోసం కష్టపడే వారని గుర్తు చేశారు. తమ నాన్న ఆశీస్సులతో తమకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు, 

అంతకుముందు  బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఈ సందర్బంగా.. కాకా తమ మధ్యలో లేక 11 సంవత్సరాలు గడిచిందన్నారు. కాకా పేదల కోసం పాటుపడే వారన్నారు.  నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు.