
ముగిసిన కేఎంసీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్
కేఎంసీ, ఎంజీఎం అభివృద్ధికి సహకరిస్తమన్న ఓల్డ్ స్టూ డెంట్లు
కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) 60 ఏండ్ల సంబురం ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ముగిసింది. ఈ కాలేజీలో చదివి దేశ, విదేశాల్లో స్థిరపడిన ఓల్డ్ స్టూడెంట్లంతా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగస్వామ్యమయ్యేందుకు రెక్కలుకట్టుకుని వాలారు. కొందరైతే కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌ను కలుసుకొని స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకున్నారు. బ్యాచ్ లవారీగా తమ ప్రత్యేకతను తెలియజేస్తూ మస్త్ హంగామా చేశారు. తొటి ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లును అందరికీ ఓకే చోట కలుసుకునేందుకు వేదికగా నిలిచింది. 2కే రన్‌లో స్టూడెంట్లు, ఓల్డ్ స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతా కలిసి రెండు రోజులపాటు ఎంజాయ్ చేశారు. స్వీట్ మెమొరీస్ తిరిగి పయనమయ్యారు. కేఎంసీ, ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధికి సహకరించాలని శని,ఆదివారాల్లో సెలబ్రేషన్స్‌కు హాజరైన మంత్రులు ఈటల, ఎర్రబెల్లి పిలుపు నిచ్చారు. ఉత్సవాలు మస్త్ ఖుషీగా ముగిసినయ్. భారంగా వీడ్కోలు పలుకుతూ ఓల్డ్ స్టూడెంట్లు తిరుగుపయనమయ్యారు.