ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానులు, ఆత్మీయుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర సాగింది. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో విశ్వనాథ్‌ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.