ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ముంపు బాధితులు

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ముంపు బాధితులు

ముంపు నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం

ముంపు బాధితులకు కేంద్ర మంత్రుల భరోసా

న్యూఢిల్లీ: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మునక (బ్యాక్ వాటర్ ముంపు) నష్టంపై రాష్ట్రానికి లేఖ రాస్తామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు కేంద్ర మంత్రులు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి,  చెన్నూరు నియోజక వర్గం బిజేపి ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రులను  కలిశారు ముంపు బాధిత రైతులు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే కేంద్రమంత్రులను కలిశామన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునుగుతున్న పంట పొలాలపై రైతుల గోసను మంత్రికి వివరించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు, మంథని నియోజక వర్గంలో 40 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని  మంత్రి దృష్టి కి తీసుకెళ్లారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 40వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రిని కోరారు. సమావేశంలో సహాయ మంత్రి కైలాస్ చౌదరి కూడా పాలొన్నారు. రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడం వల్లే కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు వివేక్ వెంకటస్వామి.

అంతకు ముందు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరిని కలిశారు వివేక్ వెంకటస్వామి, బాధిత రైతులు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు సమస్యపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని భరోసా ఇచ్చారు కేంద్రమంత్రి కైలాష్ చౌదరి. నిన్న జంతర్ మంతర్ దగ్గర వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులు. ఇవాళ కేంద్ర మంత్రులను కలిశారు.