కాళేశ్వరం కట్టినోళ్లే.. కేసీఆర్ పార్టీకి ఫండ్ ఇచ్చారు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం కట్టినోళ్లే.. కేసీఆర్ పార్టీకి ఫండ్ ఇచ్చారు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసం కాళ్వేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. రూ. 36 వేల కోట్లు ఖర్చుతో పూర్తికావాల్సిన  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును.. కాళేశ్వరం అని తెచ్చి రూ.  లక్షా 60 వేల కోట్లకు పెంచారని ఫైర్ అయ్యారు. 

కాళేశ్వరం కట్టిన కంపెనీ ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చారని వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ప్రజల పైసలు కల్వకుంట్ల కుటుంబానికే వచ్చాయన్నారు. బీద ప్రజల పైసలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారుతయనుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబం మారిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవని జోస్యం చెప్పారు. 

 కేసీఆర్ కుటుంబం ఈడీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు నిర్బంధంలో కొనసాగిన తెలంగాణ నేడు ప్రజా పాలనలో స్వేచ్చగా ఉందన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.