మూడేళ్లకే పనితనం బయటపడింది

మూడేళ్లకే పనితనం బయటపడింది
  • నడిమికి పగిలిన సీసీ రోడ్డు, నిలిచిన రవాణా 
  • బయటపడిన రూ.800 కోట్ల కెనాల్ పనితనం

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ వాల్ 100 మీటర్ల మేర కుంగిపోయింది. మూడేండ్ల కిందే కట్టిన ఈ ప్రాజెక్టు పనితనం అప్పుడే బయటపడుతోంది. భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌‌‌‌‌హౌస్​నుంచి గోదావరి నీళ్లను అన్నారం పంప్‌‌‌‌‌‌‌‌హౌస్​లోకి తీసుకెళ్లడానికి రూ.800 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గ్రావిటీ కెనాల్‌‌‌‌‌‌‌‌ కట్టారు. అయితే తాజాగా అన్నారం గ్రామానికి దగ్గరలో 12వ కిలోమీటర్​ దగ్గర సుమారు వంద మీటర్ల కెనాల్‌‌‌‌‌‌‌‌ వాల్ ​భూమిలోకి కుంగిపోయింది. దీంతో పక్కనే ఉన్న బీటీ రోడ్డు భూకంపం వచ్చినట్టు రెండు ముక్కలుగా చీలిపోయింది. కెనాల్‌‌‌‌‌‌‌‌ కింద సిమెంట్​ కాంక్రీట్‌‌‌‌‌‌‌‌తో కట్టిన నిర్మాణం పగిలి పైకి తేలింది. రోడ్డు పగలడంతో ఐదు గ్రామాలకు  రవాణా ​ఆగిపోయింది. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ నాసిరకం పనులు, ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం వల్ల రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.