- స్థానికుల ఆందోళన.. ఉద్రిక్తత
కూకట్ పల్లి, వెలుగు : ఆల్విన్‌కాలనీ డివిజన్ఉషముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు ఎల్లమ్మబండ మీదుగా జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే, తమకు సమయం ఇవ్వకుండా, నోటీసులు అందజేయకుండా ఇండ్లను కూల్చివేశారని స్థానికులు ఆందోళనకు దిగారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దగ్గరుండి కూల్చివేతలు చేయించారని ఆరోపించారు.
అభివృద్ధి పనులకు తాము ఆటంకం కాదని, జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని వాపోయారు. తులసివనం నుంచి కూల్చివేతలు ప్రారంభమవాల్సి ఉండగా, కొందరి లబ్ధి కోసం మార్చి పేదల ఇండ్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి తమకు కనీస పరిహారం అందేలా చూడలేదని కోరారు.
