18, 19న కాకా టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీడాకారుల ఎంపిక : ఎన్.మురళీధర్ రావు

18, 19న కాకా టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీడాకారుల ఎంపిక : ఎన్.మురళీధర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: గడ్డం వెంకటస్వామి(కాకా) స్మారకార్థం నిర్వహించే తెలంగాణ జిల్లాల అంతర్ జిల్లా టీ-20 లీగ్ పోటీలకు ఈ నెల 18,19న క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శులు ఎన్.మురళీధర్ రావు తెలిపారు. ఈ పోటీలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

ఈనెల 18న కరీంనగర్, జగిత్యాల,19న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీలు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్గునూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తామన్నారు. 1995 నుంచి 2009 లోపు జన్మించిన వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సొంత క్రికెట్ కిట్  తో బర్త్ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధార్ జిరాక్స్, ఒరిజినల్స్​తో పాటు రెండు ఫొటోలతో కేడీసీఏ కార్యాలయ ప్రతినిధి బి.శ్రావణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(8688768775)ను సంప్రదించాలని తెలిపారు.