వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి..భూపాలపల్లి జిల్లా చలివాగులో ఘటన

వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి..భూపాలపల్లి జిల్లా చలివాగులో ఘటన

రేగొండ, వెలుగు: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. రేగొండ మండలం కనిపర్తికి చెందిన మత్స్యకారుడు మునిగాల రాజు(30)  బుధవారం ఉదయం గ్రామ శివారులోని చలివాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వల విసిరి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చిక్కుకుని వాగులో మునిగిపోయాడు. అటువైపు పొలాల వద్దకు వెళ్లిన రైతులు వాగులో రాజు డెడ్​బాడీ తేలి కనిపించడంతో కుటుంబ సభ్యులకు తెలిపారు. భార్య అనూష ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ ఐ తెలిపారు.