సెల్ టవర్ పనులు నిలిపివేయాలి : బాలాజీ నగర్ కాలనీవాసులు

సెల్ టవర్ పనులు నిలిపివేయాలి : బాలాజీ నగర్ కాలనీవాసులు

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ న్యూ బాలాజీ నగర్ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు పనులను నిలిపివేయాలని కాలనీవాసులు డిమాండ్​చేశారు. ఈ మేరకు బుధవారం ఆందోళనకు దిగారు. కేవలం 40 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా మూడంస్థుల భవనం నిర్మించి, దానిపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 

టవర్​కారణంగా తాము అనారోగ్యానికి గురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై 15 రోజులుగా కలెక్టర్ ఆఫీస్ లో, జీహెచ్ఎంసీ మీర్​పేట్​సర్కిల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి టవర్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు.