స్కూల్ కు రాలేదని చేతులు విరగ్గొట్టిండు.. ఇద్దరు విద్యార్థులపై ఓ ప్రైవేటు స్కూల్ప్రిన్సిపాల్ దాష్టీకం

స్కూల్ కు రాలేదని చేతులు విరగ్గొట్టిండు..    ఇద్దరు విద్యార్థులపై ఓ ప్రైవేటు స్కూల్ప్రిన్సిపాల్ దాష్టీకం
  •     రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ లో ఆలస్యంగా తెలిసిన ఘటన

వేములవాడ, వెలుగు : ప్రైవేటు స్కూల్​ప్రిన్సిపాల్ కొట్టడడంతో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల చేతులు విరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ టౌన్ లోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులు సాయి, అయాన్​ టెన్త్ క్లాస్ చదువుతున్నారు. 

స్కూల్​కు సరిగా రావడంలేదని సోమవారం ప్రిన్సిపల్ కొట్టడడంతో అయాన్​ చేయి, సాయి చేతి వేలు విరిగాయి. తన తల్లికి ఆపరేషన్​ కావడంతో 15 రోజులుగా స్కూల్​కు వెళ్లలేదని, తండ్రి గల్ఫ్​లో ఉండడంతో తల్లిని చూసుకోవడానికి ఇంటి వద్దే ఉన్నానని అయాన్​పేర్కొన్నాడు. 

అనంతరం స్కూల్ కు వెళ్లగా ప్రిన్సిపల్.. ఎందుకు స్కూల్ కు రాలేదని అడగ్గా.. తన తల్లి అనారోగ్యం వివరాలు చెప్పి పర్మిషన్​ కోరినట్టు బాధిత విద్యార్థి తెలి పారు. అయినా.. మ్యాథ్స్​నోట్స్​కంప్లీట్​చేయలేదనే కారణంతో ప్రిన్సిపల్ చితకబాదినట్టు వాపోయాడు.   

మరో విద్యార్థి సాయిని కూడా కారణం లేకుండానే ప్రిన్సిపాల్ దారుణంగా కొట్టాడు. దీంతో అయాన్​కు చేయి విరగ్గా,  సాయికి చేతి వేలు ఫ్యాక్చరైంది. బాధిత విద్యార్థులు తమ ఇండ్లలో చెప్పారు. స్కూల్ కు ప్రిన్సిపాల్​ను నిలదీశారు. దీంతో స్కూల్​యాజమాన్యం ఘటనపై బయటకు రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగినట్లు తెలిసింది.