కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కీ

ప్రభాస్ నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రెండు రోజులు కంటే వీకెండ్స్ కావడంతో  శనివారం, ఆదివారం వసూళ్లూ ఇంకా పెరిగాయి. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, నార్త్ ఇండియా కలెక్షన్స్ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.  మూడు రోజుల్లోనే మూడు వంద‌‌‌‌‌‌‌‌ల యాభై  కోట్ల క‌‌‌‌‌‌‌‌లెక్షన్ల మైలురాయిని దాటింది.

 ఈ ఘ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ను సాధించిన ప్రభాస్ ఆరో మూవీగా ఇది రికార్డ్ నెల‌‌‌‌‌‌‌‌కొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆదివారం నాటికి ఐదు వందల కోట్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను చేరుకుందని  తెలుస్తోంది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.  అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించగా  దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించారు. అలాగే హీరోలు విజ‌‌‌‌‌‌‌‌య్ దేవ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కొండ‌‌‌‌‌‌‌‌, దుల్కర్ స‌‌‌‌‌‌‌‌ల్మాన్‌‌‌‌‌‌‌‌తో పాటు డైరెక్టర్లు రాజ‌‌‌‌‌‌‌‌మౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్‌‌‌‌‌‌‌‌, హీరోయిన్స్ మృణాల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, ఫ‌‌‌‌‌‌‌‌రియా అబ్దుల్లా గెస్ట్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని  నిర్మించారు.