Kalki 2898 AD Bujji: బుజ్జి కారు స్పెషాలిటీ ఏంటి.. మేకింగ్ ఖర్చు తెలిస్తే నోరెళ్లబెడతారు

Kalki 2898 AD Bujji: బుజ్జి కారు స్పెషాలిటీ ఏంటి.. మేకింగ్ ఖర్చు తెలిస్తే నోరెళ్లబెడతారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీగా నిర్మిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, స్క్రాప్ వీడియోస్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి బుజ్జి పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బుజ్జి అంటే కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు. సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ఈ కారును పరిచయం చేయడం కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా విడుదల చేసిన బుజ్జి పరిచయ వీడియో కూడా వేరే రేంజ్ లో ఉంది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 
 
అయితే.. బుజ్జి కారును చూసిన ఆడియన్స్ ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా  బుజ్జి టైర్స్ గురించి చెప్పాలంటే.. ఓ సగటు మనిషి ఎత్తుకు సగం వరకు ఉండేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు దాదాపు -6075 మిమీ, వెడల్పు-3380మిమీ, ఎత్తు-2186మిమీ గా ఉంది. ఈ టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సీయెట్ (CEAT) చేత ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక ఈ కారును మహేంద్ర కంపెనీతో పాటు జేయం మోటార్స్ సంస్థతో స్పెషల్‌గా తయారు చేయించారు. ఇక ఈ కారు మొత్తం బరువు 6 టన్నులు కాగా.. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH. వెనుక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది. ఇక కారు తయారీ కోసం మేకర్స్ ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. కేవలం ఒక కారు కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేశారంటే రేపు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.