
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే చర్చ నడుస్తోంది. కారణం.. కల్కి 2898 ఏడీ. అవును.. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ తో నాగ్ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని, దర్శకుని ఊహకు, దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇక ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ గా తీసుకొని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ పొగిడేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ గురించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ దర్శకుడికి ఒక హీరోయిన్ సెంటిమెంట్ గా మారిందంటూవార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు మాళవిక నాయర్. అవును.. నాగ్ అశ్విన్ కల్కి తో కలిపి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. ఈ మూడు సినిమాల్లో మాళవిక నాయర్ నటించారు. ఇప్పుడు కల్కి లో కూడా మహాభారతంలో చాలా ముఖ్యమైన ఉత్తర పాత్రను ఆమెకు ఇచ్చారు నాగి.
ఇటీవల విడుదలైన ట్రైలర్ లో ఆమెకు సంబంధించిన సీన్ చూపించారు. దాంతో ఆమెకు కల్కి సినిమాలో కీ రోల్ చేసినట్టు తెలుస్తోంది. పాత్రలో మాళవిక కూడా చాలా సహజంగా కనిపించారు. కాబట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఈ హీరోయిన్ సెంటిమెంట్ గా మారింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. నాగి సినిమాలో మాళవిక ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని.. ఇప్పుడు కల్కి కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని అనుకుంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి కల్కి సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా అనేది చూడాలి.