Kalki ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ అంటూ.. శివాలెత్తుతున్న థియేటర్లు

Kalki ట్విట్టర్ రివ్యూ: బ్లాక్ బస్టర్ అంటూ.. శివాలెత్తుతున్న థియేటర్లు

వారం రోజులుగా కల్కీ సినిమా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కీ విడుదల రోజు రానేవచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ Kalki 2898AD గురువారం థియేటర్లలో సందడి చేసింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో రాత్రి నుంచే భారీ కటౌట్లు కట్టి, రచ్చ లేపుతున్నారు.సైన్స్ ఫిక్షన్, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కించడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాగా కృషి చేసినట్లుగా సినిమా మేకింగ్, టీజర్, ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తోనే అర్ధమైపోయింది. ఇక సినిమా ట్విటర్ రివ్యూ విషయానికి వస్తే.. 

సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ చూస్తే బిగ్ సక్సెస్ టాక్ సొంతం చేసుకున్నట్టే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అంటూ ట్విటర్ లో సినిమా చూసినవారు కామెంట్స్ చేస్తున్నారు. మూవీలో ప్రతీ 10నిమిషాలకు ఓ కొత్త క్యారెక్ట్ పరిచయం అవుతుందట.  కల్కీ కథ పురాణాలకు సంబంధించినదే అయినప్పటికి భవిష్యత్తుతో లింక్ చేస్తూ చూపించడం అద్భుతంగా ఉందని ప్రేక్షకులు తమ హర్షాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

హైలెవల్ టెక్నాలజీ ఉండటం ఒకెత్తు అయితే.. అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశ పటానీ లాంటి ఫేమస్  మల్టీ స్టార్స్ ఈ సినిమాలో కనిపిస్తారు.  అత్యాధునిక టెక్నాలజీ, అద్భుతమైన తారాగణంతో తెరకెక్కించిన కల్కీ మూవీ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ప్రేక్షకులు తమ రివ్యూని రేటింగ్ రూపంలో తెలియజేస్తున్నారు.