Kalki 2898 AD: ఏపీలో భారీగా పెరిగిన కల్కి టికెట్ ధరలు.. ఒక్కో టికెట్ రూ.500

Kalki 2898 AD: ఏపీలో భారీగా పెరిగిన కల్కి టికెట్ ధరలు.. ఒక్కో టికెట్ రూ.500

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, కమల్ లాంటి స్టార్స్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27న విడుదల కానుంది. అయితే కల్కి సినిమా టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన వేళ.. తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. 

టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకు ధరలు పెరుగనున్నాయి. అలాగే.. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలతో కల్కి సినిమా ఒక్కో టికెట్ దార రూ.500 వరకు పెరగనుంది. దీంతో నార్మల్ ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఒక్కో టికెట్ అంతంత ధరలు అంటే సామాన్యులు ఎలా సినిమాలు చూస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.