పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ఆర్చరీ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్జనార్దన్ తెలిపారు. ఈ నెల 16న కొల్లూరులో జరిగిన జూనియర్ స్టేట్ ఆర్చరీ మీట్లో రికర్వ్ విభాగం, ఇండియన్ రౌండ్లలో గంగరాజు, త్రిషూల్, వినయ్, అశ్విత్, మానస ప్రతిభ కనపర్చి జూనియర్ నేషనల్‌కు ఎంపికయ్యారన్నారు.
రాయపూర్‌లో జరగబోయే జూనియర్ నేషనల్స్‌లో వీరు పాల్గొననున్నట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, అకాడమిక్ హెడ్ ప్రవీణ్, ఏవో సతీశ్, సిబ్బంది సంతోష్, శ్రీధర్ తదితరులు అభినందించారు.
