
- 15న మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్న కాళోజీ హెల్త్ వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: నీట్ స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల16 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే స్థానికతకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం, సుప్రీం సూచనల మేరకు నాలుగు కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల విద్యార్థుల స్థానికతకు సంబంధించి మినహాయింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో స్టేట్ కోటా కౌన్సెలింగ్ కు మార్గం సుగమం అయింది.
దీంతో కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ స్పీడ్ పెంచింది. ఈ నెల15న నీట్ స్టేట్ కోటా మెరిట్ లిస్ట్ ను వర్సిటీ విడుదల చేయనుంది. ఆ తరువాత 16న మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెలాఖరుకు మొత్తం మూడు విడతల కౌన్సెలింగ్ తో పాటు, స్ట్రే వెకెన్సీ కూడా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభించనున్నారు.