మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు : కన్వీనర్ కోటా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ ఆదివారం నోటి ఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌ పీజీలో క్వాలిఫై అయిన స్టూడెంట్స్‌‌ ఈనెల 10వ తేదీ ఉద‌‌యం 10 గం ట‌‌ల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌‌ల వ‌‌ర‌‌కు ఆన్‌‌లైన్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్దే శిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు.

ఆన్‌‌లైన్‌‌లో సమర్పిం చిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను వర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను  విడుదల చేయనున్నారు. తర్వాత వెబ్ ఆప్ష న్లకు వర్సిటీ మరో  నోటిఫికేషన్ జారీ చేయనుంది. తర్వాత ప్రాధా న్యత  క్రమంలో  ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది.   ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమా చారం  వర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in  లో  ఉంచినట్లు పేర్కొన్నారు.