కరప్షన్​కు కేరాఫ్ కల్వకుంట్ల ఫ్యామిలీ

కరప్షన్​కు కేరాఫ్ కల్వకుంట్ల ఫ్యామిలీ
యాదగిరిగుట్ట, వెలుగు: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అవినీతికి పాల్పడి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్ గా మారిందని నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ క్యాండిడేట్​ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న పాదయాత్ర శనివారం రాత్రి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లుగా గుర్తుకు రాని ఉద్యోగాల భర్తీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ప్రకటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పులకు తెచ్చి రాష్ట్రాన్ని 50 ఏండ్లు వెనక్కి తీసుకుపోయాడని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి డెవలప్​మెంట్​ పేరుతో సీఎం కేసీఆర్  భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్ల పేరుతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్న సీఎం, గంధమల్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆలేరుకు దక్కాల్సిన తపాసుపల్లి రిజర్వాయర్ నీళ్లను మంత్రి హరీశ్​రావు సిద్దిపేట తీసుకుపోతుంటే హారతి పట్టిన ఘనత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అంతకుముందు మల్లన్న పాదయాత్ర రాజాపేట మండలం నుంచి పొట్టిమర్రి, గౌరాయపల్లి, మాసాయిపేట, సైదాపురం మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఆదివారం భువనగిరికి వెళ్లనున్నారు. నేడు మల్లన్న పాదయాత్ర ముగింపు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ తీన్మార్​ మల్లన్న పాదయాత్ర ఆదివారం ముగియనుంది. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరికి చేరుకోవడంతో 1,650 కిలోమీటర్ల పాదయాత్ర ముగుస్తోంది. ముగింపు సందర్భంగా మల్లన్న టీం భువనగిరిలోని ప్రిన్స్​ కార్నర్​ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 1,650 కిలోమీటర్లు కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని రాయగిరికి మల్లన్న చేరుకుంటారు. అక్కడి నుంచి భువనగిరిలోని ప్రిన్స్​కార్నర్​  వరకు మల్లన్న మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగసభలో మల్లన్న ప్రసంగిస్తారు. బహిరంగసభను సక్సెస్​ చేయాలని కోరుతూ ఆయన మద్దతుదారులు శనివారం భువనగిరిలో బైక్​ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మల్లన్న టీం మెంబర్లు బంధారపు నర్సయ్య గౌడ్, కీసరి నర్సయ్యగౌడ్, తమ్మల నర్సింగ్ ముదిరాజ్, ఉదర బాలరాజ్ యాదవ్, ఎండీ కరీంపాషా, రామాండ్ల ప్రసాద్, లింగస్వామి, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. for more News.. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్