- ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్న మినిస్టర్
చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్ పోచమ్మ ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అజీజ్నగర్కు వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించిన ఆయన.. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
గతంలో అనేకసార్లు పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నానని, అయితే బోనాల పండుగ సందర్భంగా రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆలయ కమిటీ శాలువాతో ఘనంగా సత్కరించింది.
