Annagaru Vostaru Update: అడ్డంకుల్ని చీల్చుకుని థియేటర్లలోకి ‘అన్నగారు’.. సంక్రాంతి బరిలో తెలుగు రిలీజ్ ఉంటుందా?

Annagaru Vostaru Update: అడ్డంకుల్ని చీల్చుకుని థియేటర్లలోకి ‘అన్నగారు’.. సంక్రాంతి బరిలో తెలుగు రిలీజ్ ఉంటుందా?

తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ మూవీ ‘వా వాతియార్‌‌‌‌‌‌‌‌’. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతిశెట్టి హీరోయిన్‌‌‌‌గా నటించింది. పొంగల్ కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదలవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఆర్థిక వివాదాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ గొడవ సద్దుమణగడంతో పొంగల్ బరిలో నిలిచింది ఈ మూవీ.

ఇక తెలుగులో  ‘అన్నగారు వస్తారు’ పేరుతో ఈ చిత్రం విడుదలవుతోంది. అయితే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఐదు సినిమాలు ఉండగా, ఈ చిత్రాన్ని నెలాఖరులో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జనవరి 23న తెలుగు రిలీజ్ ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సంక్రాంతి బరిలో ఉంటుందా?

సంక్రాంతికి టాలీవుడ్‌లో ఇప్పటికే 5 పెద్ద సినిమాలు థియేటర్లను ఆక్రమించేశాయి. ఈ క్రౌడ్‌లోకి ఒక డబ్బింగ్ మూవీని దించితే సరైన స్క్రీన్‌లు దొరకవు. షో టైమింగ్స్ కూడా పరిమితం అవుతాయి. కలెక్షన్లపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సేఫ్ ప్లాన్ తీసుకుని, ఈ చిత్రాన్ని జనవరి 23 చుట్టూ తెలుగులో విడుదల చేయాలని టార్గెట్ చేసినట్లు ట్రేడ్ టాక్. అంటే, తమిళంలో: జనవరి 14 (పొంగల్), తెలుగులో సంక్రాంతి తర్వాత, నెలాఖరు రిలీజ్

ఈ విధంగా చేస్తే.. 
• పోటీ తక్కువ
• స్క్రీన్లు ఎక్కువ
• ఓపెనింగ్స్ బాగుంటాయి

అన్న లెక్కలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అసలు ఏం జరిగింది?

గత నెల డిసెంబర్ 12న విడుదల కావాల్సిన కార్తీ చిత్రం 'వా వాత్తియార్' (అన్నగారు వస్తారు) గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా పాత ఆర్థిక వివాదానికి సంబంధించి దాదాపు రూ. 21 కోట్లకు పైగా ఉన్న రుణాన్ని వెంటనే చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. భారీ అంచనాలతో ఎదురుచూసిన అభిమానులకు  కోర్టు తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసింది.

అప్పును పూర్తిగా తీర్చే వరకు విడుదలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు పంపిణీదారులలో, థియేటర్ యజమానులలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ అడ్డంకి పూర్తిగా తొలిగిపోవడంతో విడుదలకు సిద్దమైంది.