
టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ఎంపీ కవిత నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నిజామాబాద్ ప్రజలు మరోసారి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించుకోవచ్చాన్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఎంపీ కవిత తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.