కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేసిండ్రు :కవిత

కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేసిండ్రు :కవిత

నిజామాబాద్: కేసీఆర్ నీడ నుంచి తనను దూరం చేశారని, అందుకే తన దారి తాను వెతుక్కుంటున్నానని ..మీ ఆశీర్వాదం కావాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా దేవి తండాలో జాగృతి జనం బాట పాదయాత్రను ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ' నాలుగైదు నెలలుగా రక రకాల రాజకీయ పరిణామనల వల్ల ఇక్కడికి రాలేకపోయాను. చాలా ఏళ్లు ఉద్యమం కోసం.. పార్టీ కోసం పనిచేశాను. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెల మీద చేతు వేసి ఆలోచన చేయండి. నా ఓటమి సొంత పార్టీ నేతల కుట్రనే. నన్ను కుట్రపూరితంగా సస్పెండ్ చేశారు. మళ్లీ ప్రజల్లోకి రావాలనుకున్న, తొలి అడుగు నిజామాబాద్ నుంచి మొదలు పెడుతున్నా. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకోసం పోరాడాల్సిన అవసరం ఉంది.' అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.