మెదక్, వెలుగు: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హవేలీ ఘనపూర్ మండలంలో పర్యటించారు, ఉదయం కూచన్‌పల్లి లో పాడి రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం వాడి, రాజ్‌పేట, దూప్ సింగ్ తండాలో పర్యటించారు. కొన్నాళ్ల కింద భారీ వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న బ్రిడ్జిలు, రోడ్లను పరిశీలించారు. జల దిగ్భందంలో చిక్కుకున్న దూప్‌సింగ్ తండాను సందర్శించి గిరిజనులతో మాట్లాడారు.
వరదల కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తండా నీట మునగడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గిరిజనులు ఎకరువు పెట్టారు. కలెక్టర్‌తో మాట్లాడి రోడ్లు, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపరచేలా చర్యలు తీసుకోవాలని కోరతామని కవిత చెప్పారు.
