NKR 21: పర్ఫెక్ట్ సెట్.. రామ్ చరణ్ టైటిల్తో కళ్యాణ్ రామ్ మూవీ

NKR 21: పర్ఫెక్ట్ సెట్.. రామ్ చరణ్ టైటిల్తో కళ్యాణ్ రామ్ మూవీ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేడీ బాస్ గా పేరుతెచ్చుకున్న విజయశాంతి కీ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సంధర్బంగా ఆమె పాత్రపై టీజర్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోకు ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

అయితే.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో.. ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో పవర్ఫుల్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. రామ్ చరణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో మెరుపు అనే సినిమా మొదలై ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్నాడట కళ్యాణ్ రామ్. 

అవును.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు మెరుపు అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారట. దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. కళ్యాణ్ రామ్ పర్సనాలిటీకి మెరుపు అనేది పర్ఫెక్ట్ టైటల్ అనీ, సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని  కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కాంతార ఫేమ్ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.