కమల్, మణిరత్నం కొత్త సినిమా థగ్ లైఫ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్

కమల్, మణిరత్నం కొత్త సినిమా థగ్ లైఫ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్

36 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) - దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam). ఈ గ్రేటెస్ట్ కాంబో నుంచి KH234 సినిమా వస్తోందని..అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఒక అలజడి మొదలైంది. దానికి ఒకే ఒక కారణం..వీరిద్దరి కాంబోలో 1987లో వచ్చిన నాయకన్ మూవీ. తెలుగులో నాయకుడు గా రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మరోసారి జతకట్టనున్న ఈ కాంబో..మళ్ళీ ఏ రేంజ్లో సినిమా తీస్తారనే అంచనాలు మొదలయ్యాయి.

లేటెస్ట్ గా KH234 వర్కింగ్ టైటిల్ గా వస్తోన్న..ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి థగ్ లైఫ్ (Thug Life) అనే టైటిల్ ప్రకటిస్తూ..కొత్త పేరుతో..కొత్త చరిత్ర అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. టైటిల్ గ్లింప్స్ తోనే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పేశారు మేకర్స్. మణిరత్నం టేకింగ్, ఫైట్ సీక్వెన్స్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ఈ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

కే రేవి చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రేపు నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ వీడియో రిలీజ్ చేశారు. 

ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ను సెట్ చేస్తున్నారు దర్శకుడు మణిరత్నం. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ స్టార్ జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్కు జోడీగా హీరోయిన్ త్రిష నటించనుంది. 

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ మూవీకి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఫైట్ మాస్టర్ గా అన్బరివ్ పని చేస్తుండగా..ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్ అల్టిమేట్ క్లాసిక్ అయిన తెనాలి మూవీకి..వర్క్ చేసిన రెహమాన్..దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ పనిచేస్తుండడం విశేషం.