
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీలో కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం లభించింది. అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ కమల్ హాసన్‌కు ఆహ్వానం లభించింది. ఈ ఏడాది చోటు పొందిన కొత్త సభ్యుల జాబితా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’తాజాగా విడుదల చేసింది.
We’re proud to announce our newly invited members to the Academy!
— The Academy (@TheAcademy) June 26, 2025
Meet the Class of 2025: https://t.co/W766Ksra8s pic.twitter.com/9mapg3t7Dv
ఇందులో కమల్ హాసన్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నాడు. దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 534 మంది ప్రతిభావంతులను సభ్యులుగా ఆహ్వానించినట్లు అకాడమీ తెలియజేసింది.
ఇందులో నలభై ఒక్క శాతం మంది మహిళలు ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల తుది ఎంపికలో వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 16 వరకూ ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ జరగనుండగా, జనవరి 22న తుది జాబితాను ప్రకటించి, మార్చి 15న ఆస్కార్ వేడుక నిర్వహించనున్నారు.
#KamalHaasan gets Invite to become Oscar Member 👌🏽 pic.twitter.com/5vzNv3ebLA
— Hìfi Talkìes (@HiFiTalkies) June 27, 2025