
థియేటర్ లో సంచలనం సృష్టించిన కమల్ హాసన్ "విక్రమ్" మూవీ ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. జూన్ 3న మొత్తం ఐదు భాషల్లో రిలీజైన ఈ సినిమా తమిళనాట కాసుల వర్షం కురిపించగా, తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ న స్టార్ డమ్ ను ప్రూవ్ చేసుకున్నాడు కమల్. ఇప్పుడు విక్రమ్ సినిమా ఓటీటీలో లో కూడా అదరగొడుతోంది. ఈ నెల 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ సాధించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కన్నడ, మలయాళ ఆప్షన్స్ ఇచ్చింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ ఐదు భాషల్లోనూ రికార్డ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది ఈ చిత్రం.