కమల్​నాథ్ కాంగ్రెస్​ను వీడరు: దిగ్విజయ్ సింగ్

కమల్​నాథ్ కాంగ్రెస్​ను వీడరు: దిగ్విజయ్ సింగ్

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ పార్టీని వీడరని తోటి సహచరుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ),  ఇన్ కం ట్యాక్స్ (ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల ఒత్తిడికి లోను కారని ఆయన చెప్పారు. ఆదివారం భోపాల్ లో దిగ్విజయ్  విలేకర్లతో మాట్లాడారు. తనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్ తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. “మేం అందరం కమల్ నాథ్ ను ఇందిరా గాంధీ మూడో కొడుకుగా భావించాం.

కమల్ నాథ్ అసలైన కాంగ్రెస్ నేత. ఎప్పుడు పార్టీతోనే ఉన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేంద్ర మంత్రి, సీఎంతో సహా అన్ని పదవులు ఆయనకు లభించాయి. కమల్ నాథ్ రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ తోనే ప్రారంభించారు. పార్టీని ఆయన వీడే ప్రసక్తే లేదు. కమల్ నాథ్ ఇప్పటికి కాంగ్రెస్ కు రాజీనామా లేదు. బీజేపీలోను చేరలేదు” అని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.