కమలా హ్యారిస్​ మరో చరిత్ర

కమలా హ్యారిస్​ మరో చరిత్ర

టెంపరరీగా బాధ్యతలు అప్పగించిన బైడెన్

వాషింగ్టన్: అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ కమలా హ్యారిస్​ మరోసారి చరిత్ర సృష్టించారు. శుక్ర వారం యూఎస్‌ ప్రెసిడెంట్‌గా ఆమె గంటన్నర పాటు కొనసాగారు. కొద్దిసేపే అయినా అగ్రరాజ్యం తొలి మహిళా ప్రెసిడెంట్ గా డ్యూటీ చేసి రికార్డు నమోదు చేశారు.హెల్త్​ చెకప్​కు వెళుతూ బైడెన్ ​ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​కు డాక్టర్లు శుక్రవారం హెల్త్​ చెకప్​ చేశారు. ఇందులో భాగంగా కొలనోస్కోపి (పెద్ద పేగు పరీక్ష) కూడా చేశారు. దీనికోసం బైడెన్​కు మత్తుమందు ఇవ్వాల్సి వస్తుందని చెప్పడంతో.. ఆ టెస్టుల కోసం వెళుతూ ప్రెసిడెంట్​ బాధ్యతలను వైస్​ ప్రెసిడెంట్​కమలా హ్యారిస్​కు అప్పగించారు. ఇది టెంపరరీగా జరిగే వ్యవహారమే.. అయితే, టెక్నికల్​గా అమెరికా అధ్యక్ష బాధ్యతలను ఆ కాసేపు వైస్​ ప్రెసిడెంట్ ​నిర్వహిస్తారు. ఇలా మన దేశ మూలాలున్న కమలా హ్యారిస్​ అమెరికా తొలి వైస్​ ప్రెసిడెంట్​గా, ఇప్పుడు ప్రెసిడెంట్​గా కొనసాగి రికార్డు సృష్టించారు.