త్వరలో అమెరికా నుంచి భారత్‌కు లక్షల కరోనా వ్యాక్సిన్లు

త్వరలో అమెరికా నుంచి భారత్‌కు లక్షల కరోనా వ్యాక్సిన్లు

జూన్ నెలాఖరుకల్లా అమెరికా నుంచి భారత్‌కు లక్షల్లో కరోనా వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. ఈ డోసుల పంపిణీకి సంబంధించిన విషయాన్ని  అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి చెప్పారు. అమెరికా తన దేశ పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం అమెరికా దగ్గర 8 కోట్ల డోసులు మిగిలిపోయాయి. దాంతో మిగిలిన డోసులను అవసరమున్న దేశాలకు  పంపిస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో రెండున్నర కోట్ల వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు పంపుతోంది. అమెరికా అందిస్తున్న సహకారానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 

వ్యాక్సిన్ల పంపిణీ గురించి హ్యారిస్.. భారత ప్రధానితో పాటు.. మెక్సికో, గౌటెమాలా ప్రెసిడెంట్లు, కరిబీయన్ కమ్యూనిటీ చైర్మన్‌తో కూడా మాట్లాడారు.