బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ విక్టర్

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్ విక్టర్

కామారెడ్డిటౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని  కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీవోలు , ఏపీవోలకు నిర్వహించిన ట్రైనింగ్​లో ఆయన మాట్లాడారు. ఎలక్షన్​ రూల్స్​పై అవగాహన పెంచుకోవాలన్నారు.  

పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత,  క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలన్నారు.  నిర్లక్ష్యం వహించకుండా అలర్ట్​గా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీవోల పాత్ర కీలకమన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్​, డీఈవో రాజు, కమిషనర్​ రాజేందర్​రెడ్డి,  మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.