అడ్వకేట్ల విధుల బహిష్కరణ

అడ్వకేట్ల విధుల బహిష్కరణ

కామారెడ్డి టౌన్, వెలుగు : అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన  కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేశ్ పాల్గొని మాట్లాడారు. 

అడ్వకేట్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతినిధులు వెంకట్రాంరెడ్డి, సురేందర్ రెడ్డి, దేవరాజు గౌడ్, భిక్షపతి, నర్సింహారెడ్డి, గోపి, నరేందర్ రెడ్డి, శ్రీధర్, సిద్దిరాములు పాల్గొన్నారు.