
కామారెడ్డి, వెలుగు : గణేశ్ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు, గణేశ్కమిటీ ప్రతినిధులు, మత పెద్దలతో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. లౌడ్ స్పీకర్లు రూల్స్ ప్రకారం ఉండాలన్నారు. లూజ్ వైర్లను సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు వెంటనే నిర్వహించాలన్నారు. ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ సేప్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజేలకు బదులుగా కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు చందర్, విక్టర్, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.