పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : జిల్లాలో పూర్వ ప్రాథమిక  విద్య బలోపేతానికి  కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు.  మంగళవారం జిల్లాస్థాయి పూర్వ ప్రాథమిక బోధకుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని  మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 70 ప్రైమరీ స్కూల్​లో ఈ ఏడాది పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా ప్రారంభించామన్నారు. డీఈవో రాజు, ఎగ్జామినేషన్​ అకాడమిక్ ఇయర్​ ఇన్​చార్జి  వేణు, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి నాగవేందర్​,  రిసోర్స్​ పర్సన్లు  నర్సింగ్​రావు, హరిప్రసాద్,  లింబాద్రి, నవీన్,  ప్రశాంత్,  భవాని, శ్రీకాంత్  పాల్గొన్నారు.  

ఇంటింట చెత్త సేకరణ చేపట్టాలి 

కామారెడ్డిలో ఇంటింట  చెత్త సేకరణ చేపట్టాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని   రామారెడ్డి రోడ్డులో పరిశుభ్రతపై కలెక్టర్ పరిశీలించారు.  శానిటేషన్​ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు.  రోడ్లు, కాలనీలను క్లీన్​గా ఉంచాలన్నారు.  రోడ్ల పక్కన చెత్త పెరుకుపోకుండా చూడాలన్నారు.