ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ కావాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ కావాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డిటౌన్​, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ కావాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి టౌన్​లోని రాజానగర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.  ఇసుక, మొరం విషయంలో ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ చందర్, హౌసింగ్ పీడీ విజయ్​పాల్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్​ రాజేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

మెరుగైన సేవలు అందించాలి 

ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్​లోని ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్​ను పరిశీలించారు.  మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్​కు నీటి వసతి, కరంటు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్​వో  డాక్టర్​ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్​వో ప్రభు దయా కిరణ్​ ఉన్నారు.