
కామారెడ్డి టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజన వాడలోని బస్తీ దవాఖానాను తనిఖీ చేసి, డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్, పేషెంట్ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం బాల సదనం నిర్మాణ పనులను పరిశీలించారు. డీఎంహెచ్వో చంద్రశేఖర్, తహసీల్దార్జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తదితరులుఉన్నారు.