కూరగాయల సాగు చేసుకునేలా చూడండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కూరగాయల సాగు చేసుకునేలా చూడండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన  పోడు భూముల్లో అధిక లాభాలు వచ్చే  కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసుకునేలా గిరిజనులకు అవగాహన కల్పించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులకు సూచించారు.  బుధవారం కలెక్టరేట్​లో  ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’పై అధికారుల రివ్యూలో మాట్లాడారు.  పోడు పట్టాలు ఉన్నవారికి బోరు మోటార్,  సోలార్ పంప్ సెట్లు మంజూరు చేసి భూములు సాగులోకి వచ్చేలా చూడాలన్నారు.

లబ్ధిదారులు ఎంపీడీవో ఆఫీసును సంప్రదించి స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచఇంచారు. .  డీఎఫ్​వో నిఖిత, అడిషనల్ కలెక్టర్ చందర్​నాయక్, ఆర్డీవో వీణ,  జిల్లా గిరిజన అధికారి సతీష్​ యాదవ్​,  డీఆర్డీవో సురేందర్,  హార్టికల్చర్ అధికారి జ్యోతి, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్​ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.   బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెకిర్యాల్​లో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు.  హౌజింగ్​ పీజీ విజయ్​పాల్​రెడ్డి, కమిషనర్ రాజేందర్​రెడ్డి, అధికారులు ఉన్నారు.  జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్​ను కలెక్టర్ పరిశీలించారు.  

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి 

అంగన్​వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.   కలెక్టరేట్​లో అధికారుల మీటింగ్​లో మాట్లాడారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ చందర్​నాయక్​,   జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల, డీఎంహెచ్​వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.